జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!
BPT: భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. "నిన్ను అరెస్ట్ చేయించాలంటే నాకు ఎంతసేపు.. కానీ నేను ఆ పని చేయను" అని పేర్కొన్నారు. గతంలో తాను ఏ తప్పూ చేయకపోయినా అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. అలాగే, తాను ఏ తప్పు చేయను అని అన్నారు. ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.