వెదుళ్లపల్లి పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
బాపట్ల మండలం వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఉమామహేశ్వర్ తనిఖీ చేశారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.