వర్షాలకు పడిపోయిన పెంకుటిల్లు

వర్షాలకు పడిపోయిన పెంకుటిల్లు

PPM: పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ మూలపాడు గ్రామంలో వర్షాలకు పెంకుటిల్లు పడిపోవడంతో బాధితుడు లబోదిబో మంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా స్థానిక గ్రామానికి చెందిన మాదాల వెంకయ్య పెంకుటిల్లు పడిపోయింది. ఇదే విషయంపై తహశీల్దార్ డి. రవి మాట్లాడుతూ.. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితుడికి న్యాయం చేస్తామన్నారు.