VIDEO: మడకశిర ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

సత్యసాయి: మడకశిర మండలంలో వినాయక చవితి పండగను పురస్కరించుకుని విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలని సీఐ నాగేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక మండపాల ఏర్పాటుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చని తెలిపారు. పోలీసు అనుమతి కోసం ganesh ustav.netలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.