కమ్మర్‌పల్లిలో మెగా రక్తదాన శిబిరం

కమ్మర్‌పల్లిలో మెగా రక్తదాన శిబిరం

NZB: కమ్మర్‌పల్లి మండలంలోని హాస కొత్తూర్, చౌట్ పల్లి గ్రామాల్లో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయా గ్రామాల బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.