VIDEO: ఆళ్లగడ్డలో కుండపోత వర్షం
NDL: ఆళ్లగడ్డ పట్టణంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమై నిర్మానుష్యంగా మారాయి. పెద్ద చింతకుంట, ఎస్. లింగదిన్నె సహా పలు గ్రామాల్లోనూ భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.