'రాజకీయ పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్ల పేర్లను తెలియజేయాలి'

VZM: రాజకీయ పార్టీలు నియోజకవర్గంలో ఉన్న 248 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ ఏజెంట్ల పేర్ల జాబితాను సత్వరమే కార్యాలయానికి అందించాలని సహాయ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ కె శ్రీకాంత్ కోరారు. నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పక్షాల ప్రతినిధులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు.