నేడు జిల్లాలో పర్యటించనున్న షర్మిల
NDL: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గోస్పాడు నుంచి కానాల, సిరివెళ్ల వరకు వైఎస్ షర్మిల బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేడర్ పిలుపునిచ్చింది.