సాంప్రదాయ దుస్తుల్లో దసరా వేడుకలకు హాజరైన సీఐ
మహబూబ్ నగర్ రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్ ఇవాళ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన దసరా వేడుకలకు సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. అచ్చమైన పంచకట్టులో హాజరై పోలీసు వాహన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు పాల్పడకుండా సుఖసంతోషాలతో దసరా పండుగలు జరుపుకోవాలని కాంక్షించారు.