VIDEO: స్పా సెంటర్లపై దాడులు.. యువతులు అరెస్ట్
NLR: బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగాపురం జగదీశ్ నగర్ సెంటర్‌లోని Unisex, విప్ స్పా సెంటర్లపై శనివారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడులు చేసి ఐదుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు కృష్ణవేణి, సుధీర్ మీద కేసులు నమోదు చేస్తామని సీఐ సాంబశివ రావ్ తెలిపారు.