ప్రత్యేక అధికారిగా బాధ్యతలను స్వీకరించిన పరిపాలన అధికారి
ASR: కొయ్యూరు మండలంలోని ఆర్.కొత్తూరు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో కార్యాలయం పరిపాలనా అధికారి డీ.బాలమురళికృష్ణ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు పంచాయతీ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పంచాయతీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. పంచాయతీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని, అందుకు అందరూ సహకరించాలని స్పెషల్ ఆఫీసర్ తెలిపారు.