'ఎన్నికల లెక్కింపు రోజు సహకరించండి: ఎస్సై '

'ఎన్నికల లెక్కింపు రోజు సహకరించండి: ఎస్సై '

W.G: ఉండి మండలంలోని ఎండగండి చిలుకూరు గ్రామంలో ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆదివారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈనెల నాలుగున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కవ్వింపు చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. ప్రజలంతా పోలీస్ వారికి సహకరించాలని ఆయన కోరారు.