నర్సింగ్ కాలేజ్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
GDWL: జిల్లాలో రూ.33.02 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీవోసీ మందిరంలో నర్సింగ్ కాలేజీ, విద్యార్థి వసతి గృహ ఏర్పాట్ల పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు నవంబర్ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కాలేజీని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.