VIDEO: ప్రమాదకరంగా గుంత.. తృటిలో తప్పిన ప్రమాదం

MBNR: బాదేపల్లి నుంచి భూరెడ్డిపల్లి వెళ్లే 7వ వార్డులోని రహదారిపై మురుగునీరు వెళ్లేందుకు తాత్కాలిక కాలువ ఏర్పాటు చేసి గుంత తవ్వారు. శనివారం ప్రయాణికులతో వెళుతున్న ఆటో గుంతలో ఇరుక్కొని తృటిలో ప్రమాదం తప్పింది. వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని BRS నేత శ్రీనివాస్ యాదవ్ కోరారు.