'విజ్ఞానాన్ని పెంపొందించే భాండాగారాలు గ్రంథాలయాలు'
W.G: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, విజ్ఞానాన్ని పెంపొందించే భాండాగారాలు గ్రంథాలయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఒక మంచి పుస్తకం స్నేహితుడితో సమానమని, స్వాతంత్రోద్యమంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహించాయన్నారు.