'రైల్వే స్టేషన్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'

KMM: చింతకాని మండలం నాగలవంచ రైల్వేస్టేషన్ మూసివేత నిర్ణయాన్ని అధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వేస్టేషన్ వద్ద ఆ ప్రాంతవాసులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. స్వేరోస్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. 77ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే స్టేషన్ సుమారు 15 గ్రామాల ప్రజలు ఈ స్టేషన్ పైన ఆధారపడి ప్రయాణించి జీవనోపాధి పొందేవారని అన్నారు.