VIDEO: బస్సుల్లేక ప్రయాణికుల బేజారు..!
MDK: ఆర్టీసీ సమ్మెతో మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. నేడు బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వేచి చూసినా ఫలితం లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.