VIDEO: ఎదుట ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఆందోళన
MNCL: మందమర్రి ఏరియా GM కార్యాలయం ఎదుట ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఫిబ్రవరి 28తో పాత కాంట్రాక్ట్ గడువు ముగియడంతో తమను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టు సంస్థ వచ్చే వరకు పాత వారినే కొనసాగించేలా సింగరేణి యాజమాన్యం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబాలు వీధిన పడతాయని వాపోయారు.