'ఆరు నెలలుగా అందని జీతాలు'

'ఆరు నెలలుగా అందని జీతాలు'

VKB: మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆరు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. తాండూరు మోడల్ స్కూల్ సిబ్బంది తమ గోడు వెళ్లబోసుకున్నారు. జీతాలు రాక కుటుంబం గడవడం కష్టంగా మారిందని మంగళవారం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లోని జీతాలను విడుదల చేయాలని వారు కోరారు.