VIDEO: అధికారులతో ఎమ్మెల్యే టెలి కాన్ఫరెన్స్
ELR: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలలో ప్రజల అభ్యర్థన మేరకు శ్మశాన వాటికల కోసం తక్షణమే స్థలాలను కేటాయించాలని ఆయన ఆదేశించారు. అనేక గ్రామాల్లో శ్మశాన వాటికలు లేకపోవడంతో రోడ్ల పక్కనే అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయని, ఇది చాలా బాధాకరమన్నారు.