'అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోంది'

'అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోంది'

MDCL: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రావల్ కోల్‌లో రాత్రింబవళ్లు అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు ధనార్జనే ధ్యేయంగా మట్టిని తరలిస్తున్నారని మండిపడుతున్నారు. అధికారులు, వ్యాపారులు కలిసికట్టుగా మట్టి దందాకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.