'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి'
జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రైతులు మొక్క పంటను సాగు చేశారన్నారు. పంట కోత పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర రూ.2,400 అందించాలన్నారు