చేవెండ్ర గ్రామంలో భారీ చోరీ

కృష్ణా: పెడన మండలం చేవెండ్ర గ్రామంలో కమలాకరరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబం బంధువులను పరామర్శించడానికి మచిలీపట్నం వెళ్లిన సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 25 కాసుల బంగారం, రూ. 2 లక్షల నగదును దోచుకెళ్లారు. గురువారం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.