మూడో తేదీ వరకు సభ్యత్వ నమోదు
VSP: ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ (ఎన్‌ఏజె) సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో తేదీ వరకు కొనసాగనుంది. శుక్రవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఏపీ ఎన్జీవో హోంలో మూడో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.