ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

MDK: నర్సాపూర్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు.