మల్కాజ్‌గిరి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

మేడ్చల్: మల్కాజ్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ముందడుగు పడిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నేడు వైద్య బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సిబ్బంది కొరత పరిష్కారం, మెరుగైన నీటి సదుపాయాలు, బయోమెడికల్ వేర్ మేనేజ్‌మెంట్, డయాలసిస్ యూనిట్, రక్త బ్యాంక్ ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చలు జరిపారు.