నేడు మద్నూర్ జీపీ తైబజార్ వేలం: సెక్రెటరీ
KMR: మద్నూర్ గ్రామపంచాయతీ తైబజార్ వేలంపాట ఇవాళ(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తామని కార్యదర్శి సందీప్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. వేలంపాటలో గ్రామస్థులందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.