దగ్ధమైన కారు మాజీ ఎమ్మెల్యే కుమారుడిదే.!

దగ్ధమైన కారు మాజీ ఎమ్మెల్యే కుమారుడిదే.!

మేడ్చల్: ఉప్పల్ రింగ్ రోడ్డులోని వరంగల్ బస్టాప్ వద్ద ఆదివారం కారులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో.. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కుమారుడు ప్రవీణ్ గౌడ్ తన కుటుంబంతో షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా కారులో మంటలు చెలరేగాయని తెలిపారు. అప్రమత్తమైన వారు వెంటనే కారు దిగగా.. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైందన్నారు.