అంచనా బడ్జెట్‌పై ప్రతిపక్షం విమర్శలు
KMM: ఏదులాపూరం మున్సిపాలిటీలో 2026-2027 ఏడాదికి గాను మున్సిపాలిటీ కౌన్సిల్ అంచనా బడ్జెట్‌ను రూ. 72.34 కోట్లుగా అంచనా వేశారు. అంచనా బడ్జెట్‌కు సంబంధించి ఖర్చుల వివరాలను మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ ప్రతిపాదనలను పాలకవర్గం ముందుంచారు. అయితే గత ఏడాది రూ. 9.71 కోట్లుగా ఉన్న బడ్జెట్ ఏడాదికే రూ.72 కోట్లు ఎలా సాధ్యమని విపక్ష సభ్యులు తమ అనుమానాలను సమావేశంలో వ్యక్తపరిచారు.