ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఎండల తీవ్రత
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం ఎండల తీవ్రత కొనసాగింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టపల్లిలో 44.1, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గోధూరులో 44, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టెంలలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే ఐదు రోజులు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదై ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.