ఆసుపత్రి అభివృద్ది సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ది సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అధితి విజయలక్ష్మీ, జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వచ్చే రోగుల పట్ల శ్రద్ధ చూపించాలని, వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.