తెలంగాణలో ఏపీ వాళ్ల విగ్రహాలా..?: పృథ్వీరాజ్
TG: HYD రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతుండగా.. తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకంటూ శుభలేఖ సుధాకర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రముఖులు గద్దర్, అందెశ్రీ విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.