VIDEO: బడికి వెళ్లాలంటే తప్పదు సాహసం

VIDEO: బడికి వెళ్లాలంటే తప్పదు సాహసం

ASR: జీ.మాడుగుల మండలం బూసిపల్లి గ్రామానికి రహదారి, పాఠశాల నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. బడికి వెళ్లే పిల్లలు సుమారు 50 మంది ఉన్నారని, పాఠశాల, రహదారి లేక కాలినడకన కృష్ణాపురం వెళ్లి చదువుకుంటున్నారన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మార్గ మధ్యలో కొండవాగు ఉప్పొంగి ప్రవహిస్తోందని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటి, పిల్లలు బడికి వెళుతున్నారని వాపోతున్నారు.