కంభం చెరువును పరిశీలించిన కలెక్టర్
ప్రకాశం: తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంభం చెరువు అలుగు పారుతుంది. శనివారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డితో కలసి కంభం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. మార్కాపురం ఇంఛార్జ్ సబ్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.