INSPIRATION: విశ్వనాథ సత్యనారాయణ

INSPIRATION: విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ సత్యనారాయణ.. తెలుగు సాహిత్యంలో 'కవి సమ్రాట్'గా ప్రసిద్ధి చెందారు. ఆయన రాసిన 'రామాయణ కల్పవృక్షం' అనే మహాకావ్యానికి 1971లో ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఈ కావ్యంలో శ్రీరాముని కథను ఆధునిక దృక్పథంతో, తెలుగుదనం మేళవించి రచించారు. కవి, నవలా రచయిత, నాటకకర్త, విమర్శకుడుగా ఆయన 150కి పైగా రచనలు చేశారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో ఆయన కృషి అనిర్వచనీయం.