సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం అమరావతిలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి అంశాలు, వివిధ సమస్యలపై సీఎం దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు అందజేశారు.