బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NRPT: బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం ఉట్కూర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని అన్నారు. క్యూబా సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు.