నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: వినుకొండలోని పలు ప్రాంతాల్లో అత్యవసర విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ పిచ్చయ్య తెలిపారు. సిద్ధార్థనగర్, కొత్తపేట, విద్యుత్‌నగర్, బాలమ్మ బజార్, సురేష్ మహల్ రోడ్డు, నరసరావుపేట రోడ్డు, శివ స్తూపం ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.