ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమే: జేడీ వాన్స్

ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమే: జేడీ వాన్స్

క్రూడాయిల్, గ్యాస్ ధరలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితి వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమే అని, త్వరలో ధరలు దిగి వస్తాయని వెల్లడించారు. ఏడాది, రెండేళ్లు యుద్ధం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకోవడం లేదన్నారు. ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.