2 గ్రామీణ, 2 పట్టణ ప్రాంతాల్లో జనగణన ప్రీటెస్ట్
AP: మొదటి విడత జనగణన ప్రీటెస్ట్‌లో భాగంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో గృహాల జాబితా, సెన్సస్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి, నంద్యాల జిల్లా మహానంది మండలాలతో పాటు ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ, విశాఖపట్నంలోని 2, 3 వార్డుల్ని ఎంపిక చేశారు. ఈనెల 10 నుంచి 30 వరకు కుటుంబాల సంఖ్య, వివరాలు సేకరించనున్నారు.