పెను తుఫాన్.. వందల విమానాల రద్దు

పెను తుఫాన్.. వందల విమానాల రద్దు

అమెరికాలో సంభవించిన తీవ్ర తుఫాన్ కారణంగా వందల విమానాలు రద్దయ్యాయి. దీంతో అనేక నగరాల్లో విమాన ప్రయాణం స్తంభించిపోయింది. దాదాపు 750 విమానాల రాకపోకలు రద్దయ్యాయని, 1300కుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని 'ఫ్లైట్ అవేర్' సంస్థ వెల్లడించింది. అలాగే, పలు విమానాశ్రయాల భద్రతా చెకింగ్ పాయింట్ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది.