గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం: సునీత
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన సునీత ఈ నెల 22న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న భూ సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఆశతో ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే అందరి సహకారంతో గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని సునీత హామీ ఇచ్చారు.