సోదరుడిని విడిపించాలంటూ.. నటి కన్నీటి రిక్వెస్ట్
UAE జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించమంటూ బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. తన SM ఖాతాలో ఓ కన్నీటి పోస్టు పెట్టింది. 'నా సోదరుడు మేజర్ విక్రాంత్ జైట్లీని UAE జైల్లో పెట్టి ఏడాదిపైనే అవుతోంది. 8 నెలలపాటు ఎవరితోనూ టచ్‌లో లేకుండా నిర్బంధంలో ఉంచారు. నిన్ను ఈ భారత గడ్డపైకి తీసుకొచ్చే వరకు పోరాటం ఆపను. కాళికా మాతాకీ జై..' అంటూ ఎమోషనల్ అయ్యింది.