'కమిటీ మెంబర్లకు ఎస్సై సూచనలు'

W.G: ఉండి మండలంలోని వినాయక ఉత్సవ కమిటీ మెంబర్లకు ఉండి ఎస్సై నసీరుల బుధవారం ఉండి MDO ఆఫీస్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊరేగింపుల్లో ఎటువంటి అశ్లీల నృత్యాలు గాని భారీ డీజే బాక్సులు గాని పెట్టరాదని అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో MRO నాగార్జున, MDO రవీంద్ర, AE నాగరాజు పాల్గొన్నారు.