లక్ష్యానికి దూరంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
MNCL: జన్నారం మండలంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యానికి చాలా దూరంలో ఉంది. మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం 757 ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయగా, 20 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అభయారణ్యం కావడంతో ఇసుక సరఫరాను నిలిపివేయడం, తదితర కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు.