కొత్తపేటలో ఘనంగా తీజ్ పండుగ

కొత్తపేటలో ఘనంగా తీజ్ పండుగ

MNCL: జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామంలో బంజారా సంఘం నాయకులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని బంజారా గూడాలలో తీజ్ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో సోమవారం సాయంత్రం కొత్తపేట గ్రామంలో బంజారా సంఘం నాయకులు, మహిళలు తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు గోధుమ మొలకలను ధరించి తీజ్ నృత్యాన్ని చేశారు.