ఇంటి పన్ను చెల్లించండి: డిప్యూటీ ఎంపీడీవో

ఇంటి పన్ను చెల్లించండి: డిప్యూటీ ఎంపీడీవో

ELR: ఇంటి పన్ను చెల్లించకపోతే కుళాయిలను డమ్మీ చేయాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఇంటి పన్ను వసూలుపై ఆయన ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను వసూలు చేశారు. కార్యక్రమములో పంచాయతీ అభివృద్ధి అధికారి విజయకుమార్ పాల్గొన్నారు.