MEMORY: నేటికి 99 ఏళ్లు పూర్తి

తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య చరిత్రలో ఓ ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న 'గోలకొండ(గోల్కొండ)' పత్రిక ప్రారంభమై ఇవాళ్టికి 99 ఏళ్లు పూర్తయింది. 1926లో మే 10న TGకి చెందిన ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు సురవరం ప్రతాపరెడ్డి 'గోలకొండ' పత్రికను ప్రారంభించారు. ఇది అప్పటి సమాజంలో నెలకొన్న సామాజిక, రాజకీయ సమస్యలపై గళం విప్పింది. ఎంతో మంది యువ రచయితలకు వేదికగా నిలిచింది.