ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
SRPT :రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటి ఛై ర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు.