విద్యుత్ అధికారుల ప్రజా బాట కార్యక్రమం
SRCL: తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్‌లో విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల డివిజన్ ఇంజనీర్ అంజయ్య మాట్లాడుతూ.. గ్రామాలలో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రైతులు, ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.